ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. ఏసీబీ బృందాలు ఒకేసారి 18 చోట్ల సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించి ఇంకా అంబేద్కర్, ఆయన బినామీలు, బంధువులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు…
అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి నకిలీ పులి చర్మాన్ని 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని అమ్మే ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. టైగర్ స్కిన్ కి ఉన్న డిమాండ్ తో మేక తోలును పులి తోలుగా రంగులు వేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్…