వైరస్ వ్యాప్తి ప్రమాదంతో పోలిస్తే, తల్లి తన శిశువుకు పాలు పట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ నియోనాటల్ ఫోరం తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, నిలోఫర్ వైద్య నిపుణులు మరిన్ని సందేహాలకు వివరంగా సమాధానమిచ్చారు. తల్లిపాలతో శిశువులకు వైరస్ సోకదని, తల్లికి పాజిటివ్ వచ్చినా బిడ్డకు పాలు పట్టవచ్చు అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టాలి, కరోనా స్వల్ప లక్షణాలున్నా నేరుగా…