Kieron Pollard: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 (CPL 2025)లో ఆదివారం జరిగిన 23వ మ్యాచ్ ప్రొవిడెన్స్ వేదికగా గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ట్రిన్‌బాగో బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లుగా ఉన్న కీరాన్ పొలార్డ్, డ్యారెన్ బ్రావోలు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా కీరాన్ పొలార్డ్ తన అద్భుత బ్యాటింగ్‌తో విద్వాంసం సృష్టించాడు.…
వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
Shreyanka Patil to Play for Guyana Amazon Warriors in CPL: భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ఎవరూ కూడా సీపీఎల్‌లో భాగం కాలేదు. సీపీఎల్ ఆడనున్న తొలి టీమిండియా ప్లేయర్ శ్రేయాంకనే. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయాంక.. సీపీఎల్ ఆడే ఛాన్స్ కొట్టేసింది.…