క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. సమస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు…