EAM S Jaishankar: భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కెనడా చర్యలను మరోసారి బహిరంగంగా తప్పుపట్టారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీ శక్తులకు పెద్దపీట వస్తోందని, ఖలిస్తానీ శక్తులకు భారత్-కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అనుమతి ఉందని మంగళవారం ఆయన అన్నారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీలకు చోటు ఇవ్వడంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు వారి రాజకీయాలు స్థితి అలా ఉందని వ్యాఖ్యానించారు.
Canada-India Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల వాణిజ్యం నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా కెనడా దీని వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుంది, ఎందుకంటే అక్కడ అనేక రంగాలు, వ్యాపారాలలో భారతీయుల సహకారం పెద్దగా ఉంటుంది.