Cakes: కొన్ని కేక్‌లలో ‘‘క్యాన్సర్’’ కారక పదార్థాలు ఉండే అవకాశం ఉందని కర్ణాటక ఆహార భద్రత-నాణ్యత విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రెండు నెలల క్రితం కబాబ్‌లు, మంచూరియన్, పానీ పూరీలతో సహా రాష్ట్రంలోని కొన్ని స్ట్రీట్ ఫుడ్ శాంపిల్స్‌లో కార్సినోజెన్స్ అని పిలువబడే క్యాన్సర్ కారక పదార్ధాల ఉనికిపై ఆహార భద్రతా విభాగం ఇదే విధమైన ఆందోళనల్ని లేవనెత్తింది.