బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.
టికెట్ తీసుకోనందుకు హర్యానాకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు రాజస్థాన్ రోడ్‌వేస్‌లో చలాన్ జారీ చేశారు. దీంతో హర్యానా, రాజస్థాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ కారణంగా.. హర్యానా పోలీసులు రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులకు చలాన్లు జారీ చేయగా.. ఆదివారం రాజస్థాన్‌లో హర్యానా రోడ్‌వేస్ బస్సులకు 26 చలాన్లు జారీ చేయబడ్డాయి.
బడ్జెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం రూ. 25 వేలు ఉంటే.. 5G నెట్ వర్క్ కలిగి ఉన్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు చాలా సార్లు కస్టమర్‌లు వాటి పనితీరు.. కెమెరా క్లారిటీ కోసం ఏ ఫోన్‌ను కొంటే బాగుంటుందో తెలుసుకోరు. ఈ క్రమంలో.. ఇప్పుడున్న బెస్ట్ ఫోన్ల జాబితాను మీ ముందుంచాం. వీటిలో మీకు ఇష్టమైన బ్రాండ్ ఏదైనా ఫోన్‌ని కొనుగోలు చేయండి.
ప్రస్తుతం ప్రజలు తమ కంఫర్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సొంత ఇళ్లు, సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కారు కొనుక్కోలేని వారు ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.కారు కొనేటప్పుడు మీ అవసరానికి తగినట్లు ఎటువంటి కారు కొనాలో నిర్ణయించుకోవాలి. సైజ్, ఇంధన రకం, గేర్ బాక్స్, బాడీ…