ప్రస్తుతం ప్రజలు తమ కంఫర్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సొంత ఇళ్లు, సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కారు కొనుక్కోలేని వారు ఎక్కువ మంది సెకండ్ హ్యాండ్ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.కారు కొనేటప్పుడు మీ అవసరానికి తగినట్లు ఎటువంటి కారు కొనాలో నిర్ణయించుకోవాలి. సైజ్, ఇంధన రకం, గేర్ బాక్స్, బాడీ స్టైల్ వంటి వాటిని కారు కొనే ముందు పరిగణలోని తీసుకోవాలి. కారు చరిత్ర తెలుసుకోవడం సెకండ్ హ్యాండ్ కార్లు కొనే ముందు తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య వీఐఎన్ నెంబర్ ను ఉపయోగించాలి. దీని ద్వారా గతంలో కారుకు జరిగిన ప్రమాదాలు, ఓనర్ హిస్టరీ, సర్వీస్ రికార్డ్స్. మైలేజ్, వాహనం పైన ఏమైనా లోన్ లు ఉన్నయేమో తెలుసుకోవచ్చు.
Also Read: APJ Abdul Kalam: హ్యాట్సాఫ్ కలాం.. గిఫ్ట్ కి కూడా చెక్ ఇచ్చారా?
కారు కొనుగోలు చేసేటప్పుడు దాన్ని లోపల, బయట క్షుణ్ణంగా పరిశీలించాలి. తుప్పు, డెంట్‌లు, సరిపోలని పెయింట్‌వర్క్ లాంటివి ఏమైనా ఉన్నయోమో చెక్ చేసుకోవాలి. లైట్లు, కిటికీలు, లాక్ వంటి అన్ని ఫీచర్లు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. టెస్ట్ డ్రైవ్ కు వెళ్లండి. దీని వల్ల కారు ఎలా వెళుతుంది, ఏవైనా శబ్ధాలు వస్తున్నాయా, వైబ్రేషన్స్ వస్తున్నాయా అనే విషయాలు తెలుసుకోవచ్చు. మీరు చెక్ చేసిన తరువాత కూడా ఇంకా కనిపించని చాలా సమస్యలు ఉంటాయి. అందుకే మెకానిక్ ను పిలిపించి చెక్ చేయించుకోవాలి.
మీకు అన్ని విధాలుగా నచ్చింది అనుకుంటే యజమానితో ధర గురించి మాట్లాడండి. మార్కెట్ రేట్లను సరిపోల్చుకున్న తరువాతే కొనుగోలు చేయడం అవసరం. ఇక కొనే ముందు రిజిస్ట్రేషన్ పత్రాలు, బీమా సర్టిఫికేట్లు వంటి అన్ని అవసరమైన పత్రాలను చెక్ చేయడం మర్చిపోవద్దు. కారు కొన్న తరువాత యాజమాన్యం బదిలీకి సంబంధించిన అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయండి. సేల్ డీడ్, ట్రాన్స్‌ఫర్ ఫారమ్‌లు మొదలైన అన్ని అవసరమైన డాక్యూమెంట్లు ఎటువంటి తప్పులు తేకుండా ఉండి ఇరుపక్షాల వారు సంతకాలు చేసి ఉండాలి. ఇక కారు కొన్నాక దానికి రెగ్యూలర్ గా సర్వీస్ చేయిస్తుంటే కారు మంచి కండీషన్ లో ఉంటుంది.