Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ దూకుడు పెంచుతుంటే… ప్రతిపక్షం మాత్రం తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతోందట. అలా ఎందుకంటే… పార్టీలో గ్రూపు రాజకీయలేనన్నది కేడర్ సమాధానం. నేతలు తలో దిక్కులా ఉంటే….కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా అంత చురుగ్గా…
అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చానన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం, ఆ తరువాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమెను కొనసాగించకపోవచ్చన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో ఆంటీముట్టనట్టు ఉంటున్నారట. కర్నూలు ఎంపీగా ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉన్న బుట్టా రేణుక.. కరోనా పూర్తిగా తగ్గిపోయాక కూడా యాక్టివ్‌గా లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట బుట్టా రేణుక. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న రేణుక.. సీటు ఖరారు చేయాలని వైసీపీ అధిష్టానాన్ని…