తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది. కొన్నాళ్ల క్రితమే..…