తమిళనాడు రాజధాని చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు చేస్తోంది. పలుచోట్ల ఒకేసారి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రూ.5,832 కోట్ల విలువైన బీచ్ ఇసుక తవ్వకాల కుంభకోణం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా తమిళనాడు వ్యాప్తంగా 18 చోట్ల సీబీఐ దాడులు చేపట్టింది.