ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా బంపర్ డిస్కౌట్ ఆఫర్స్ ప్రకటించింది. వివిధ రకాల మోడళ్లపై గరిష్టంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. మీరు బడ్జెట్ ధరలో మంచి కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు.
భారత కార్ మార్కెట్‌లో దక్షిణ కొరియా కంపెనీ కియా తన ముద్ర వేసుకొని దూసుకెళ్తోంది. సెల్టోస్, సోనెట్, కియా కారెన్స్ కంపెనీ ఫ్లీట్‌లోని అత్యుత్తమ కార్లలో ఒకటి నిలుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌పై నజర్ పెట్టింది.
పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువచ్చే పంటలు కొన్ని ఉన్నాయి. అందులో సులభంగా పండించుకునే పంటలో గోరు చిక్కుడు ఒకటి. గోరు చిక్కుడుతో అన్నీ లాభాలుంటాయా అంటే అవుననే అంటున్నారు. పంట విషయానికి వస్తే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సైతం గోరుచిక్కుడు ఏపుగా ఎదుగుతుంది. దీనికి ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ. గోరుచిక్కుడు మనం కూర మాత్రమే వండుకొని తింటాం కానీ.. దానిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా ఫ్రాంచైజీల వైపు చూస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు.
తాజాగా ఇవాళ (సోమవారం) కూడా గోల్డ్ రేట్‌లో పెరుగుదల కనిపించకపోవడంతో పాటు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. రూ. 60,480గా ఉంది.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి మారుతి సుజుకి ఇండియా జిమ్నీ (Jimny) ఈనెల(జూన్) 5న గ్రాండ్ గా మార్కెట్లోకి రానుంది. మారుతి సుజుకి తమ SUV పోర్ట్‌ఫోలియోను జిమ్నీతో మరింత విస్తరించనుంది. ఇందులో ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా కూడా ఉన్నాయి.
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో వ్యాపారంలో కొత్త వ్యాపారంలోకి దిగనున్నారు. ఇందుకు ముంబైలోని బీఎంసీలో విలాసవంతమైన హోటల్‌ను నిర్మించనున్నారు.
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది.
Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 13 మిలియన్ డాలర్లను( సుమారు రూ.106 కోట్లు) వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని విస్తరించాలని ఫాక్స్ కాన్ భావిస్తుంది. దీంతో ఈ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. ఫాక్స్‌కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ఆపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లర్.
ఇవాళ్టి( మే 1 ) నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతాయి. మే 1 నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. GST, CNG-PNG, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్ తో సహా అనేక నిమయాల్లో మార్పులు ఉంటాయి.