Top Five Insurance Companies in India: జీవితానికే కాదు. వాహనాలకు, సంస్థలకు, వ్యాపారాలకు, ఆరోగ్యానికి, పంటలకు ఇలా.. ప్రతి కేటగిరీలోనూ ఇన్సూరెన్స్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చాలా బీమా సంస్థలు ఉన్నాయి. అయితే జనం ఎక్కువ శాతం ప్రభుత్వ బీమా సంస్థల వైపే మొగ్గుచూపుతుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇండియాలోని టాప్ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మూడు సంస్థలు సర్కారుకు సంబంధించినవే కావటం దీనికి నిదర్శనం.
Learn to Earn: లెర్న్ టు ఎర్న్ అనేది హైదరాబాద్‌లోని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌వాళ్లు ఇస్తున్న సందేశం. ఆ కంపెనీ నినాదం. మన దగ్గర డబ్బులు ఉంటే వాటితో ఇల్లు కొనాలా లేక వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా అనే డౌట్ వస్తుంది. ఇలాంటి సందేహాలను ఎన్నింటినో ఈ సంస్థ తీరుస్తుంది. ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి మంచి సలహాలు సూచనలు ఇస్తుంది. అది కూడా పైసా ఖర్చు లేకుండా.