బిజినెస్ ముఖ్యమా? పార్టీ ముఖ్యమా? ప్రస్తుతం టీడీపీలో ఇదే చర్చ. కొంతమంది నేతలు బిజినెస్సే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తూ… కుదిరిన సమయంలో మాత్రమే వస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాల కోసమే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా బిజినెస్ పొలిటీషియన్స్? వ్యాపారాల కోసం సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న టీడీపీ నేతలు?ఏపీ టీడీపీలో బిజినెస్ పొలిటీషియన్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోయిన తొలినాళ్లలో టీడీపీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా లేకున్నా.. కొంచెం నిరాశ నిస్పృహల్లో…