రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి.
నాసిక్-షిర్డీ హైవేపై బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందగా, 34 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్రలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు శుక్రవారం ట్రక్కును ఢీకొట్టింది. పతారే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.