NewYork Bus Accident: న్యూయార్క్ లో రోడ్డు ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సును ఢీకొన్న మరో బస్సు.. 80 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NewYork Bus Accident: రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇండియన్ కాలమానం ప్రకారం శుక్రవారం న్యూయార్క్ సిటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 80 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో చాలా మందికి ఎముకలు విరిగగా.. మరికొందరికి తలకు గాయాలు అయ్యాయి. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో డబుల్ డెక్కర్ టూర్ బస్సు సిటీ కమ్యూటర్ బస్సును ఢీకొట్టింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో 80 మందికి గాయాలు అయ్యాయి. మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టేషన్ అథారిటీ నడుపుతున్న బస్సు వెనుక భాగాన్ని ఢీకొనడంతో డబుల్ డెక్కర్ టాప్వ్యూ టూర్ బస్సు ముందు అద్దాలు పగిలిపోయాయి.
Read also: Ujjaini Bonalu: రేపు ఉజ్జయని మహంకాళి బోనాలు.. ఉదయం 4 గంటలకు తొలిబోనం
Also Read
మన్ హట్టన్ తూర్పు వైపున ఉన్న ఫస్ట్ అవెన్యూ, 23వ స్ట్రీట్ వద్ద రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయని న్యూయార్క్ అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాద స్థలంలో సుమారు 63 మందిని వైద్య సిబ్బంది పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ చాలా మందికి ఎముకలు విరిగినట్టు అధికారులు తెలిపారు. దాంతోపాటు తలకు, మెడకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారిప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని అగ్నిమాపక శాఖ డిప్యూటీ చీఫ్ పాల్ హూపర్ తెలిపారు. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలైనప్పటికీ అవేవీ ప్రాణాంతకం కావని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇష్రక్ జహాన్ అనే ప్రయాణికుడు ‘సీబీసీ న్యూస్’తో మాట్లాడుతూ.. ఒక్క సారిగా తన పక్కన ఉన్న మహిళ గట్టిగా అరిచిందని.. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని.. అదే సమయంలో ఓ బస్సు మా వైపు దూసుకురావడాన్ని గమనించానని చెప్పారు. క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని.. తరువాత ఎక్కడ చూసినా గాజు ముక్కలే కనిపించాయన్నారు. ఇదంతా ఓ సినిమాలో చూపించినట్టుగా అనిపించిదని.. కొంత సమయం తరువాత అక్కడక్కడ రక్తం కనిపించిందని.. వెంటనే తను 911కు ఫోన్ చేశానని చెప్పారు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!