Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసి 2 సమీపంలో నేషనల్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది..ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు క్యాబిన్ భాగం పూర్తిగా ధ్వంసం అయింది..బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయి క్యాబిన్ లో ఇరుక్కుపోయ్యారు..మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావటంతో స్థానికులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.…
ఓ బైకర్ నిర్లక్ష్యం కారణంగా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. హైవేపై బస్సు వేగంగా దూసుకొస్తోంది. ముందున్న బైక్.. సడన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక బస్సు డ్రైవర్.. బైకిస్టుల ప్రాణాలు కాపాడేందుకు వేరే రూట్‌లోకి పోనిచ్చాడు.
తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో భక్తులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హరిణి దాటిన తరువాత డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో.. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది.
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులున్నారు.
Bus Accident: మహారాష్ట్రలోని గోండియా – కొహ్మారా మధ్యలోని రహదారిపై ఖజ్రీ గ్రామ సమీపంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు భండారా నుంచి సకోలి లఖానీ మీదుగా గోండియా వైపు వెళ్తున్న శివషాహి బస్సుకు అకస్మాత్తుగా బైక్ ఎదురుగా వచ్చింది.…
Bus Accident: ఓ అదుపుతప్పిన డీటీసీ బస్సు ఢిల్లీ రింగ్ రోడ్డులోని మొనాస్టరీ మార్కెట్ సమీపంలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌ను, మరో వ్యక్తిని గుద్ది చంపేసింది. బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులు చనిపోయారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘాజీపూర్‌కు చెందిన డిటిసి బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ (57)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నమన్నారు. బస్సు పరిస్థితి బాగాలేకపోవడంతో బస్సులో డీటీసీ డీఓ…
Road Accident: హైదరాబాద్లోని షాపూర్ నగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు రాంకీ సంస్థలో పనిచేసే హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఘటనాస్థలిలో ప్రమాదానికి కారణమైన బస్సుపై వాహనదారులు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఉదయం రోడ్లపై పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు రోడ్డుపై…
Siddharth Nagar Sharda River Bus Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ జిల్లా బధాని బ్లాక్ మోహన్కోలా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవిపటాన్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా చార్ గహ్వా వంతెనపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, ముగ్గురు వ్యక్తులు మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారు ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. బస్సులో ప్రయాణికుల…
Kamareddy School Bus: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సులో బ్యాటరీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.