Martin Luther King : ఆసక్తికరంగా వున్న సంపూర్ణేశ్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ టీజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్టిన్ లూథర్ కింగ్’.రాజకీయాలపై సెటైరికల్ కామెడీ మూవీగా ఈ చిత్రం రూపొందింది.తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా మూవీ కి రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‍లో సంపూర్ణేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. యంగ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్‍లు అందింటంతో పాటు కీలక పాత్ర కూడా పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.నేడు (అక్టోబర్ 2) ‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్ రిలీజ్ అయింది.ఓ గ్రామంలో దక్షిణం, ఉత్తరం వారంటూ అంటూ రెండు వర్గాలు వాదించుకోవడం తో ‘మార్టిన్ లూథర్ కింగ్’ టీజర్ ప్రారంభం అవుతుంది.. ఆ తర్వాత నరేశ్ ఉత్తరం నుంచి వెంకటేశ్ మహా దక్షిణం నుంచి గ్రామ ప్రెసిడెంట్ అయ్యేందుకు పోటీ పడతారు. ప్రతీదానికి ఉత్తరం, దక్షిణం అంటూ నాయకులు, ప్రజలు ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఇలా గొడవలు కూడా ఎంతో కామెడీగా ఉంటాయి.
ఎన్నికల్లో నరేశ్, వెంకటేశ్ మహా పోటీ చేస్తారు. ఓటరు జాబితాను లెక్కిస్తే.. నరేశ్, వెంకటేశ్ మహాకు సమానమైన ఓట్లు వచ్చేలా కనిపిస్తాయి. దీంతో గ్రామంలో సంపూర్ణేశ్ బాబు ఎవరికి ఓటేస్తే వారే గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో అప్పటి వరకు గ్రామంలో ఎవరూ పట్టించుకోని కనీసం పేరు కూడా పెట్టని సంపూర్ణేశ్ బాబు చుట్టూ నరేశ్, వెంకటేశ్ మహాతో పాటు గ్రామస్తులు అంతా తిరుగుతారు. ఆ ఒక్క ఓటు కోసం సంపూర్ణేశ్ బాబుకు చాలా బహుమతులు ఇస్తారు. కింగ్.. కింగ్.. అని కూడా పిలుస్తుంటారు. ఆలోచిస్తానంటూ సంపూ వారికీ చెబుతూ వుంటారు.. ఇలా టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.ఈ సినిమాలో పేరు కూడా లేని సంపూకు మార్టిన్ లూథర్ కింగ్ అని హీరోయిన్ శరణ్య ప్రదీప్ పేరును పెడుతుంది.. ఈ మార్టిన్ లూథర్ కింగ్ అస్సలు ఎవరికి ఓటు వేస్తాడు.. ఓటు వేశాక అతడి పరిస్థితి ఏంటి అనేదే ఈ మూవీ కథ. ఓట్ల కోసం ప్రజలను కొందరు రాజకీయ నాయకులు ఎలా ప్రలోభపెడతారు.. ఎన్నికలు అయిపోయాక ఎలా ప్రవర్తిస్తారన్న విషయాలపై సెటైరికల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా సాగనుందని సమాచారం..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!