పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. కొత్తగా పెళ్లయిన ఓ మహిళను ఆమె భర్త సజీవ దహనం చేశాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దీంతో.. ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహవల్‌నగర్‌కు చెందిన సబా ఇక్బాల్‌ను.. భర్త అలీ రజా హత్య చేశాడు. సబా, రజా ఎనిమిది నెలల క్రితం కోర్టు వివాహం చేసుకున్నారు.