నగరంలోని కూకట్‌పల్లిలోని వివేకానంద కాలనీలో భారీ చోరీ జరిగింది. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాలీ దంపతులు పనిచేస్తున్న ఇంటికే కన్నమేసి భారీగా నగదు, బంగారం ఎత్తుకుపోయాయిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెలితే.. కూకట్‌పల్లి వివేకానంద కాలనీలో నివాసముండే వడ్డేపల్లి దామోదర్‌రావు ఇంట్లో నేపాల్‌కి చెందిన చక్రధర్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా చేరాడు.. తనతో పాటు భార్య సీత, మూడేళ్ల కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే.. చక్రధర్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుండటంతో.. దామోదర్‌రావు కుటుంబం అతడిని పూర్తిగా…