అల్లు అరవింద్ కి చెందిన గీత ఆర్ట్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించే నిర్మాత బన్నీ వాసు తన పొలిటికల్ జర్నీ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తండెల్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. 2024 ఎన్నికల్లో కూడా పిఠాపురం లేకపోతే ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరఫున బన్నీ వాసు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ మీరు…