అయోధ్యలో గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై యోగి ప్రభుత్వం యాక్షన్‌కు దిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాధిత కుటుంబం కలిసింది.
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు "ఫ్యాషన్"గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఖతీపురాలోని రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించారని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కొట్టివేసింది.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన మత హింసకు కారణమైన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం 'బుల్డోజర్ చర్య' చేపట్టింది. నూహ్ జిల్లాలో వరుసగా మూడో రోజు బుల్డోజర్ చర్య కొనసాగుతోంది. అల్లర్లకు దెబ్బతిన్న నుహ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని తావ్‌డూ పట్టణంలో శుక్రవారం అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లను మధ్యప్రదేశ్‌లో అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియాగా గుర్తించబడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్ధి మూత్ర విసర్జన కేసులో నిందితుడు ప్రవేశ్ శుక్లా నివాసాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ సర్కారు కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
Uttar Pradesh: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో హిందూ సంస్థలు, విశ్వహిందూ పరిషత్ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. మంగళవారం ఫతేపూర్ లోని నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేశారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు.
Uttarakhand Girl Assassination Case: ఉత్తరాఖండ్ లో అంకితా బండారీ అనే 19 ఏళ్ల యువతి హత్య ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్య వెనక బీజేపీనేత కుమారుడి హస్తం ఉండటంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు