పులి కనిపిస్తే చాలు చాలా వరకు పక్షలు, జంతువులు దాని సమీపంలో ఉండేందుకు ప్రయత్నించవు. కానీ దానికి భిన్నంగా ఓ బాతు మాత్రం పులిలో దాగుడుమూతలు ఆడింది. ఆకలితో ఉన్న పులి బాతుపై అటాక్ చేయడానికి రావడంతో వెంటనే నీటిలో మునిగిపోతూ పులికి మస్కా ఇచ్చింది. ఓ కొలనులో ఉన్న పులి నేర్పుతో, ఓపికగా, నిదానంగా బాతుపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే బాతు నీటిలో మునిగిపోతుంది. దీంతో పులి అయోమయానికి గురై అటూ ఇటూ చూసుకుంటుంది.…