ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయం బ్లాక్ వన్ లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీపీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు అధికారులు. ఏప్రియల్ 4 నుంచి ప్రారంభం…
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను…
కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఉదయం సమావేశం అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేపింది. ఈ సందర్భంగా సోషియో ఎకనమిక్ సర్వే విడుదలయింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. దీని ప్రకారం జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది. ఏపీలో యాన్యువల్ గ్రోత్ రేట్ 18.47 శాతంగా ఉంది.కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది.…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను…
సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని మంత్రి బుగ్గన అన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి అని, దాన్ని వృధా చేయవద్దని కమిటీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. బీహెచ్ఈఎల్ వంటి పెద్ద సంస్థలు వస్తే ప్రవేట్ సంస్థలు వస్తాయని, ఏ రాష్ట్రమైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాయని అన్నారు. Read: అభివృద్ధి వికేంద్రీకరణ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ…
అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్యం తప్పదు అని మంత్రి బుగ్గన అన్నారు. ఆయుర్వేదిక్, హోమియోపతి వేల సంవత్సరాల నుంచి వున్నా అత్యవసరంలో అల్లోపతి బెటర్ అని తెలిపారు. కోవిడ్ విషయంలో ప్రపంచం అనుసరిస్తున్న ప్రోటోకాల్ ఫాలో కావాల్సి వస్తుంది. కరోనాను ఏపీ ప్రభుత్వం అద్భుతంగా హాండిల్ చేస్తుంది. ప్రభుత్వం, అధికారులు కరోనాకట్టడికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వం కరోనా పై సమీక్ష చేస్తుంది. కోవిడ్ నివారణకు ప్రజల సహకారం ముఖ్యం అని తెలిపిన మంత్రి బుగ్గన లక్షణాలు…