Telangana Assembly: తెలంగాణ శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6 నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనేది ఆ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌లో నిర్ణయిస్తారని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తెలిపారు. అజెండాను కూడా ఆ రోజే చర్చించి ఖరారు చేస్తారని చెప్పారు. మునుగోడు శాసన సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి