GHMC Council : జీహెచ్‌ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్‌ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్‌తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు…