నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. భద్రాపూర్ విమానాశ్రయంలో బుద్ధ ఎయిర్ ఏటీఆర్ 72 విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్‌వే నుంచి దూసుకెళ్లింది. ఒక నది వరకు దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.