విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు బుద్దా వెంకన్నను తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు అడ్డుపడ్డారు టీడీపీ కార్యకర్తలు.. బుద్దా అనుచరులు. బుద్ధా వెంకన్నపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153, 505, 506 సెక్షన్ల కింద FIR నమోదయింది. బుద్దాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మైలవరపు దుర్గారావు. కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని,…