భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే శాఖ భూముల వ్యవహారంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నష్ట పరిహారం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధిత కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మణుగూరు మండలం రామానుజవరం బీటీపీఎస్ కోసం రైతుల భూముల ను బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రెవిన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు…
లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.…