బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. నేను అగ్ని పర్వతంలా ఉన్నానని, రాజకీయ కక్షతోనే నా…