భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరబాటుగా సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ జవానును పాక్ బంధీగా చేసుకుంది. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన జరిగి 85 గంటలకు పైగా గడిచినా, సైనికుడిని తిరిగి ఇవ్వడంపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.