టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తొలిసారి ఢిల్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. తన అధికార నివాసంలో బస చేస్తున్నారు.. ఈ వారాంతం వరకు హస్తినలోనే కేసీఆర్ మకాం వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
TRS పై నేను వేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు BRSగా పేరు మారదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
త్వరలోనే నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో బరిలోకి దిగుతుందా? లేక టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పోటీ చేస్తుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. నిన్నటి నిన్ననే టీఆర్ఎస్ను…