సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవంటూ లిక్కర్ స్కాం పై ఎంపీ అర్వింద్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారని, చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. చేయమని చెబుతున్నామన్నారు. ఓ ఛానెల్‌లో దర్యాప్తు సంస్థలపై జేడీ లక్ష్మీనారాయణ చాలా క్లారిటీగా చెప్పారని, సోనియా గాంధీ ముద్దాయి, ఆమె నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికి కవిత లిక్కర్ కేసులో విట్నెస్ మాత్రమే, ఆమె విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదని, సాక్షి దగ్గరకు విచారణ అధికారులు వెళ్తారు. నిందితులను తమ దగ్గరకు పిలుచుకుంటారన్నారు. బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక కమిటీ వేశారన్నారు. అధ్యాయం చేస్తున్నాం, జాతీయ అంతర్జాతీయంగా స్టడీ చేస్తున్నామన్నారు అర్వింద్. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చాలా కీలకం కానుందని, మా రిపోర్టులో సగానికి పైగా ముఖ్యమంత్రికి తెలుసన్నారు అర్వింద్.
Also Read : RRRforOscars: ఎన్టీఆర్, చరణ్ ల కష్టానికి ఫలితం దక్కనుంది…
రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ది అని ఆయన విమర్శించారు. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కేసీఆర్ అని, రుణమాఫీ కోసం వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, 485 మంది సిద్దిపేటలో బలి అయ్యారన్నారు. తెలంగాణలో పవర్ కట్స్ నడుస్తున్నాయని, అప్పులు చేసి విద్యుత్ కొంటూ కుంభకోణాలకు పాల్పపడుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చిన డబ్బులు లిక్కర్ స్కాంలో పెట్టారని, యువరాజు ఇప్పుడు ఇంకా టెన్షన్‌లో ఉన్నారని, కేసీఆర్ తన పొలంలో ఎకరాకు కోటి రూపాయల లబ్ది పొందుతున్నారట, రైతులకు కూడా చెప్పొచ్చు కదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంటలకు మార్కెటింగ్ కోసం బడ్జెట్ ను తగ్గించారని, బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో సాయిల్ టెస్ట్ జరుగుతోందని, కానీ తెలంగాణలో భూ పరీక్షలు లేవన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ చేస్తాము అన్నారని, విత్తనాలపై పరిశోధనకు రూపాయి ఖర్చు పెట్టలేదని, బడ్జెట్ కేటాయించలేదన్నారు.
Also Read : Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!
అంతేకాకుండా. ‘టమాటా పరిస్థితి దారుణం. గత మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. రైతుల కోసం కేటాయించిన నిధులను కాళేశ్వరం లో ముంచుతున్నారు. ఉపాధిహామీ నిధులు దారి మల్లిస్తున్నారు. కేసీఆర్ కు బిడ్డ కోసం , కొడుకు కోసం కోట్లు ఇవ్వడానికి మనసు ఉంది. రైతుల కోసం పసల్ భీమా వాటా మాత్రం కట్టాడు. ఫారెస్ట్ రేంజర్ హత్య ఘటన తర్వాత, పొడు భూముల సర్వే ను ఆపేశారు. గుజరాత్ లో రైతులకు 3 లక్షల రూపాయలు ఇంట్రస్ట్ ఫ్రీ కింద ఇస్తోంది. గుజరాత్ లో ఏడో సారి మళ్ళీ బిజెపి గెలుస్తోంది. ఇంట్రస్ట్ ఫ్రీ విధానం ఏపీలో కూడా ఉంది. ఎన్నారై సెల్ పెడతాం అన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ కేరళలో అధ్యయానానికి వెళ్ళాడు. అక్కడ విజయ్ నయ్యర్ తో సంప్రదింపులు చేసారు.
ఎన్నారైల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. కేంద్రం మోడీ దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూసే కార్యక్రమాలకు కేసీఆర్ లాంటి వాళ్ళు అడ్డం పడుతున్నారు. లిక్కర్ స్కాం పై ఎంపీ అరవింద్. సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవు. నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. చేయమని చెబుతున్నా. ఓ ఛానెల్ లో దర్యాప్తు సంస్థలపై జేడీ లక్ష్మీనారాయణ చాలా క్లారిటీగా చెప్పారు. సోనియా గాంధీ ముద్దాయి, ఆమె నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికి కవిత లిక్కర్ కేసులో విట్నెస్ మాత్రమే, ఆమె విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదు. సాక్షి దగ్గరకు విచారణ అధికారులు వెళ్తారు. నిందితులను తమ దగ్గరకు పిలుచుకుంటారు.’ అని ఆయన మండిపడ్డారు.