పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు ఇతరులతో బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం న్యూఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దేశ రాజధానిలోని ఓ హోటల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత కార్యాలయం తెలిపింది. కవిత నేతృత్వంలోని సాంస్కృతిక సంస్థ భారత్ జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కవిత బయలు దేరారు. అయితే.. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలతో కవిత ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.
Also Read : Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలోకి అమెరికా ప్రవేశం?
అన్ని పార్టీలను కవిత ఏకతాటిపైకి తెస్తున్నారని, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని అంటున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దేశంలోని మహిళల సమస్యలపై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. రేపు మరోసారి ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ నెల 11న కూడా ఆమె ఈడీ ముందు హాజరయ్యారు. ఆమెను తొమ్మిది గంటల పాటు ఈడీ విచారించింది. అయితే.. రేపు ఈడీ విచారణలో ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read : 56Blades in Stomach : చావాలని 56షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కానీ