ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని.. ఈసారి అదే గతి పడుతుందని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారని.. అప్పుడు సీఎం కేసీఆర్ ను మోడీనే వద్దన్నారని వినోద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదని ఆరోపించారు. GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ను చూసి మోడీ భయపడుతున్నారని చెప్పారు.
ఇందూరు సభలో ప్రధాని మోడీ కేసీఆర్ సీక్రెట్స్ అన్ని బయటపెట్టారు. తాను తెలంగాణ పర్యటనకు వస్తున్న సమయంలో తనకు స్వాగతం పలకపోవడంపై కీలక విషయాలు చెప్పారు. GHMC ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలికేవారన్నారు. కానీ GHMC ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందని తెలిపారు. GHMC ఎన్నికల్లో బీర్ఎస్ కు మద్దతు ఇవ్వమని కేసీఆర్ తనను అడిగారని చెప్పారు.
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ 'X' వేదికగా విమర్శలు గుప్పించారు. పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అయితున్నడని తెలిపారు. నిజామాబాద్ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖలో ప్రస్తావించారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిదే పెత్తనం ఉంటుంది.. అది కేవలం రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Dr Lakshman: ప్రధాని మోదీ వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి Dr లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు.