బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ముందుకి ఎందుకు రావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. చవక విద్యుత్ కాదని కమిషన్ కోసం బీ అర్ ఎస్ బాటలో కాంగ్రెస్ నడవాలని చూస్తుందా? అని ఆయ వ్యాఖ్యానించారు. వేసవి ఇప్పుడిప్పుడే మొదలైంది..అప్పుడే కరెంట్ కోతలు స్టార్ట్ చేశారని, పగలు కరెంట్ లేక రాత్రి మోటార్ ఆన్ చేయడానికి వెళ్లి రైతులు పాము కాటుకు బలవుతున్నారన్నారు.
అంతేకాకుండా..’సీఎం రేవంత్ ఎన్నికల వేళ PCC అధ్యక్ష అవతారం ఎత్తుతా అని మాట్లాడుతున్నారు.. సీఎం రేవంత్ నీవు గేట్లు తెరిచి రాజకీయం చేస్తే … కరెంట్ సంగతి ఎవరు చూడాలి? బీఅర్ఎస్ Ppl అక్రమాలు వెలిక్కి తీస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పారు.. ఇప్పుడు చర్యల ఊసే తీయడం లేదు.. CM వాటాదారుల నుంచి అక్రమ సొమ్ము పంచుకునేందుకు ఆలస్యం చేస్తున్నారా? Ppl చేసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? కాంగ్రెస్ అవినీతి పరులతో చెట్టపటలు వేసుకోవడం పట్ల ప్రజలకు అనుమానం కల్గుతుంది.. పీసీసీ అధ్యక్షుడుగా రాజకీయం చేస్తూ.. అబివృద్ధి నీ గాలికి వదిలేస్తారా ? కేజ్రీవాల్ మద్యం వ్యాపారం లో అవినీతి చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కాలేదు? కేజ్రీవాల్ కి 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది.. విచారణ వెళ్లకుండా ఎందుకు తప్పించుకున్నారు? కేజ్రీవాల్ అరెస్ట్ విషయములో కోర్ట్ జ్యోక్యం చేసుకోనని చెప్పి.. చెప్ప పెట్టు వంటి తీర్పునిచ్చింది. రాహుల్ గాంధీకి ఇండియన్ డెమోక్రసీ మీద విలువ లేదు. రాహుల్ గాంధీ ఎప్పటికీ అప్పుడు దేశం పట్ల , మోడీ విషం వెళ్లగక్కుతునే ఉన్నారు. అకౌంట్ లు ఫ్రీజ్ చేస్తే కాంగ్రెస్ కి ఉలుక్కేందుకు? కాంగ్రెస్ హయాంలో లెక్క పత్రం లేకుండా విరాళాలు తీసుకున్నారు. ఇప్పుడు లెక్కలు ఉన్నాయి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.