ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.
బంగారు తెలంగాణగా మారుస్తానని.. సీఎం కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ వారసిగుడ సభలో ప్రజా గోస - బీజేపీ భరోసా శక్తి కేంద్రాల్లో బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు నేను కలిసి పని చేశామని గుర్తుకు చేసుకున్నారు.
హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను అమల్లో చూపించండి అంటూ చురకలంటించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా ఆయన మాట్లాడుతూ..బడ్జెట్ అంత అంకెల గారడే అంటూ విమర్శించారు. 70-80 శాతం నిధులు విదులుకావాలన్నారు