Pochampally Srinivas : ఫాంహౌస్ కేసులో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణలో, ఫాంహౌస్ లీజుకు సంబంధించిన వివరాలను, ఘటనకు సంబంధించి ఆయన పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట న్యాయవాది , ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఉన్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత…
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎస్పీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..కానిస్టేబుల్స్ ను కేసీఆర్ మనుషులుగా చూస్తే.. రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారన్నారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KTR Tweet: హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికపై వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
KTR Emotional Tweet: రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు.
Jagadish Reddy: 'ఖమ్మం-నల్గొండ-వరంగల్' పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Kandala Upender Reddy: పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పై దళిత వర్గాలు అసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన వారికి పదవులు కేటాయించడంలో అదేవిధంగా దళిత అధికారులను విషయంలో వేధింపులకు గురి చేస్తున్నారని దళిత వర్గాల ఆరోపిస్తున్నారు.