ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు బ్రదర్ అనిల్, సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. క్రిస్టియన్ నేతలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు.. ఇక, త్వరలోనే వైఎస్ షర్మిల ఏపీలోనూ కొత్త పార్టీ పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, బ్రదర్ అనిల్‌కు కౌంటర్‌గా తిరుపతిలో ఏపీ క్రిష్టియన్ జేఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.. బ్రదర్ అనిల్ రాజకీయ పార్టీ పెడతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏపీ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్..
Read Also: TS SSC Exams: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే 23 నుంచి..
దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్ ఎప్పుడు రాజకీయ అవతారం ఎత్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు ఎలమంచిలి ప్రవీణ్.. తెలంగాణలో పెట్టుకున్న పార్టీ పనులు చూసుకోండి.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చకండి అంటూ విరుచుకుపడ్డ ఆయన.. అగ్రకులానికి చెందిన బ్రదర్ అనిల్ కుమార్… బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఉద్ధరిస్తాననడంలో అంతర్యమేంటి? అని ప్రశ్నించారు. కేఏ పాల్ పతనం తర్వాత బ్రదర్ అనిల్‌ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాంతి దూతగా ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్న ప్రవీణ్.. బ్రదర్ అనిల్ రాజకీయాల్లో తలదూర్చకూడదని ప్రేమగా హెచ్చరిస్తున్నాం అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్.