బ్రిస్బేన్‌లో పరుగుల వరద పారిస్తాడనుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు. జోస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో.. కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.