WFI: మహిళా రెజ్లర్లపై, మైనర్లపై లైంగిక దాడి చేశాడని మాజీ రెజ్లింగ్ ఫెడరేషర్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు పెద్ద ఉద్యమమే చేశారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ తాజా ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బ్రిజ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించారు.
ప్రపంచ వేదికపై భారత్‌కు పెద్ద అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్‌ఐ విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది.
ఆరుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆయన విచారణను ఎదుర్కోవచ్చని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
Wrestlers Protest: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అయితే ఈ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రెజ్లర్ సాక్షిమాలిక్, తన భర్త సత్యవర్త్ కడియన్ తో కలిసి మాట్లాడుతూ.. ఈ కేసులో మైనర్ రెజ్లర్ బాలిక తండ్రికి బెదిరింపులు రావడంతోనే భయపడి తన స్టేట్మెంట్ ను మార్చుకున్నారని ఆరోపించారు.
Notice To Wrestlers: సాలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల పోరు కొనసాగుతోంది. తమను జంతర్ మంతర్ నుంచి తరిమికొట్టారని, అయినా బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని రెజ్లర్లు తేల్చి చెప్పారు.
Wrestlers protest: నిరసనకు దిగిన రెజ్లర్లు, ప్రభుత్వం మధ్య చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. బుధవారం వారం రోజుల వ్యవధిలో రెండోసారి క్రీడాశాఖ మంత్రి, రెజ్లర్ల మధ్య జరిగిన సమావేశంలో పలు డిమాండ్లు ఆమోదం పొందాయి.
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
Rahul Gandhi: రెజ్లర్ల ప్రదర్శనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుు పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.