అత్తారింటికి ప్రయాణమైన నవవధువు మార్గమధ్యంలో అనూహ్యం నిర్ణయం తీసుకుంది. పెళ్లైన ఏడు గంటలకే అత్తవారిల్లు దూరంగా ఉందంటూ అకస్మాత్తుగా ఏడుపు మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లేందుకు ఆ వధువు నిరాకరించింది. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. తిరిగి పుట్టింటికి పయనమైంది.