Road Accident: ఎన్నో కలలతో వివాహంతో ఓకమైన కొత్త జంటను రోడ్డు ప్రమాదం కబళించింది. వధూవరులతో సహా ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్కు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.