అధికారం చేతులో ఉంది కదా.. ఆటలాడుకున్నారు ఆ పోలీసులు. కంచే చేను మేసింది అనే విధంగా నడుచుకున్నారు. ఇల్లీగల్ మనీ ఉంటే దాన్ని నిర్ధారించి కేసు బుక్ చేయాల్సింది పోయి.. విడిచి పెట్టేందుకు లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో సస్పెండ్ అయ్యారు. కట్టల కొద్దీ డబ్బు చూసి ఆశ పెరిగింది..కట్టల కొద్దీ డబ్బులు చూసి వారిలో ఆశ పెరిగింది.. కోట్లు కళ్ల ముందు ఉండడంతో రూల్స్ పక్కకు పెట్టేశారు.కోట్ల రూపాయలు కళ్ల ముందు…
Bombay High Court: రూ.100 లంచం తీసుకున్న అధికారి కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కోర్టు ఉపశమనం ఇచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు..2007లో రూ.100 లంచంగా తీసుకోవడం చాలా చిన్న అంశమని, లంచం కేసులో ప్రభుత్వ వైద్య అధికారిని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది.
దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరు, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసింది సీబీఐ.. కాంట్రాక్టర్ల నుంచి ఈఈ రూ.1.29కోట్ల లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపింది.. దక్షిణ మధ్య రైల్వే బెంగళూరు ఈఈ ఘన్ శ్యాం ప్రధాన్‌తో పాటు.. గుత్తేదార్లు ఎం.సూర్యనారాయణరెడ్డి, వంగల సూర్యనారాయణరెడ్డిపై కేసులు నమోదు చేసింది సీబీఐ.. ఇక, ఇవాళ దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేపట్టారు సీబీఐ అధికారులు.. నంద్యాల, రంగారెడ్డి జిల్లా, బెంగళూరు, హుబ్లీ, సంగ్లీ సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించాయి…