కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.…
బీఆర్ఎస్ వాదన మేము దొంగతనం చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు అడుకోవద్దు అనేలా వాదన ఉందని టీపీసీసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ కమిషన్ వేసినా కమిషన్ ను ప్రశ్నించడం ఎదురు దాడి చేయడం అలవాటుగా మారిందని, హైకోర్టు చెప్పినట్టు విందామన్నారు. ఏ కమిషన్ వేసినా దానికి సమాధానం చెబుతామని టిఆర్ఎస్ నేతలు అన్నారని, అలాంటప్పుడు ఎందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నరు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నారు. మీ నాయకుడిని హౌస్ కి…
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి కొత్త గూడెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. వర్ష కాలం నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గోదావరి వరదలపై కలెక్టరేట్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఆ తరువాత సహచర మంత్రులతో కలిసి మనుగూరు బయలుదేరి వెళ్లి మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు సమస్కరించారు మంత్రి తుమ్మల.. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అన్నారు మంత్రి మంత్రి తుమ్మల. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు…
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ఏర్పాటు చేసిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త చట్టాల అనువాద ప్రక్రియ కూడా అధునాతన దశలో ఉందని, జులై 1లోపు పూర్తి చేయాలని భావిస్తున్నామని, నోటిఫికేషన్ డ్రాఫ్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని, కొత్త చట్టాలను సజావుగా అమలు చేయడం…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,సెక్రటరీ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోటా నీలిమ,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ,దేవాలయ కమిటీ ,ఇతర స్థానిక ముఖ్యనేతలు.. పోలీస్…
కొత్తగూడెం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బయలుదేరారు. ఆయనతో పాటు.. మంత్రులు కోమటిరడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉదయం 11-00గంటలకు రూ.4కోట్ల రూపాయల DMFT నిధులతో బైపాస్ రోడ్డు నుంచి జివి మాల్ వరకు చేపట్టనున్న డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన చేయనున్నారు. అంనతరం 11.30 గంటలకు అమృత్ 2.0 గ్రాంటు రూ.124.48కోట్ల…
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామల చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రైయిల్ రన్ గటగా రాత్రి సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది .సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17 వేల కోట్ల రూపాయలు అంచనా తో పది లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు కోసం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన వివిధ కేంద్రమంత్రులతో సమావేశాలు అవుతూనే… అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతున్నారు. మూడురోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తొలిరెండు రోజులు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మూడోరోజు బుధవారం పీసీసీ చీఫ్ నియామకం, రాష్ట్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్…
తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో తెలిపింది. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. జూన్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది జూన్ 27 , 28 తేదీలలో నగరంలో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన ఈదురు గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ…