కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వేయించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్నినార్‌లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీలకు నిరసన జూనియర్ లెక్చరర్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోలనకు దిగారు. బదిలీల్లో న్యాయం చేయాలని మంత్రి సబిత ఇంటి ముందు జూనియర్ లెక్టరర్లు బైఠాయించారు.…
కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో కనిపిస్తోంది. అనుకున్నదానికంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. గత 10 రోజుల క్రితం దేశవ్యాప్తంగా 50 వేల లోపు నమోదైన కరోనా కేసులు కేసులు ఇప్పుడు లక్ష 50 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 1,79,723…
నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లో నీటిమట్టం పెరిగింది. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి. ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ…
పండుగలకు విందుభోజనం చేయడం మాములే.. అయితే విందుభోజనం కోసం మేక మాంసమో లేక చికెన్‌ను కొనుగోలు చేయాలి.. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మేకలు దొంగతనం చేసి సంక్రాంతి విందుభోజనం చేద్దామనుకున్నారు. కానీ చివరికి మేకలు ట్విస్ట్ ఇవ్వడంతో జైలు పాలయ్యాడు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మేకల గుంపులోని మేకను దొంగతనం చేసేందుకు ఇద్దరు రాత్రి వెళ్లారు. మేక గుంపులోకి వెళ్లారు తీరా మేకను దొంగతనం చేద్దామనుకొని మేకను పట్టుకునే…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఎంతో మంది జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం, ఒమిక్రాన్ ఇండియాలో వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న…
నకిలీ సర్టిఫికెట్ లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు. వెబ్సైట్లో స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకురానుంది. స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ద్వారా, నకిలీ సర్టిఫికెట్ దందా ను అరికట్టడం, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని అధికారులు…
ఏపీలో రేపట్నుంచి 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10-13 వరకు హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసులు, 12, 13వ తేదీల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు ఇవ్వనున్న ప్రభుత్వం పేర్కొంది. మున్సిపాల్టీలు, పీఆర్ అండ్ ఆర్డీ, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులకు…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సీని, రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. అయితే కరోనా సోకి దాని నుంచి బయటపడినవారికి సైతం మరోసారి కరోనా సోకుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, హీరో విశ్వక్సేన్ ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థాణైంది. అయితే ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన…
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వ్యాప్త నేపథ్యంలో భారీగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబందనలు కఠినతరం చేయడంతో పాటు, నైట్ కర్ఫ్యూను విధిస్తున్నారు. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా వచ్చిన కరోనా కేసలు సంఖ్య నిన్నటితో పోల్చితే తక్కువగా…