తెలువారందరి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారందరూ ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భోగి, మకర సంక్రాంతి, కనుమగా ఇలా మూడు రోజులు పండుగను అత్యంత వైభవోపేతంగా తెలుగువారందరూ జరుపుకుంటారు. అయితే నేడు భోగి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేకువజామునే భోగి మంటలు వేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల…
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్వలో చెత్తచెదారం తీయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం…
బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీజేపీ పట్ల టీఆర్ఎస్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఈ మధ్య బీజేపీ ఒడిపోవాలని కేసీఆర్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్ మెంట్ ఎక్కడ లేదని ఆయన పేర్కొన్నారు.…
అకాల వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం రైతులు తీవ్రంగా నష్టపోయారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకీల విత్తనాల కారణంగా మిర్చి రైతులకు వచ్చే క్వింటాల్ మిర్చి కూడా అకాల వర్షాలతో రాకుండా పోయిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోయిందని ఆయన వెల్లడించారు. దాదాపు 500 కోట్ల పంట నష్టం జరిగిందని, పంట నష్టం జరిగితే ఏడేళ్లలో ఇంత…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్య చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. దీంతో నిర్మాతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు. ప్రస్తుతు ఏపీ ఈ విషయం ముదురుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఏపీ సినిమా టికెట్ల ధరలపై చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం జగన్…
చెన్నై ఎయిర్‌పోర్డ్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద రూ.55.29 లక్షల విలువ చేసే యూఎస్ డాలర్స్, దిర్హమ్స్, దినార్స్, రియాల్స్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ వెళుతున్న ముగ్గురు ప్రయాణీకులు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా, విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిప్‌లో దాచి కేటుగాళ్లు తరలించేందుకు ప్రయత్నించారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో విదేశీ కరెన్సీ బాగోతం బయటపడింది. దీంతో కరెన్సీ సీజ్…
ఇటీవల దక్షినాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్ వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. దీంతో ఒమిక్రాన్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరింది. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య అత్యధికంగా 1,367కు చేరుకుంది. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, బెంగాల్లో 294, ఉత్తర్‌ప్రదేశ్‌లో…
పండుగలు వచ్చిదంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతంగా పెంచేసి సామాన్యుడు జేబుకు చిల్లుపెడుతుంటాయి. పండుగ సమయాల్లో సుమారు టికెట్ల ధరలో సుమారు 50 శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. అయితే అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 ప్రైవేట్ ట్రావెల్స్…
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ వైపీసీ ఎమ్మెల్యే సినిమా వాళ్లపై చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. దీనిపై తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలోని నిర్మాతలు స్పందించి సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవిని సినిమా ఇండ్రస్టీకి పెద్దగా ఉండాలని కొందరు కోరగా.. నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని.. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా ముందుంటానని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లిన వారు తిరిగి తమ సొంతూరు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ నేపథ్యంలో సొంతూరు వెళ్లావారితో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా చూసిన ప్రయాణికుల రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీ ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో పాటు సొంత వాహనాల్లో జనాలు సొంతూళ్లకు…