కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ పేర్కొంది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్…
మియాపూర్ పీయస్ పరిధిలో ఆయుధాలతో పట్టుబడిన పాత నేరస్తులు పట్టబడ్డారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేయగా.. బీహార్‌కు చెందిన ఒకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక తపంచా, ఒక కంట్రీ మేడ్ పిస్టల్, రెండు మ్యాగ్జీన్ లు, 13 బుల్లెట్లు, ఒక బైక్, ఒక కారు, ఆరు మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ.. కొంతమంది వెపన్స్ తో మంజీరా పైప్ లైన్ రోడ్డు లో తిరుగుతున్నారనీ నిన్న ఉదయం 10 గంటలకు…
మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ఇటీవల మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం దేశాలలో సైతం ఆగ్రహజ్వాలలు రగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కువైట్‌లో ప్రవాసులు నిరసనలు చేపట్టారు. దీంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిరసనకారులకు హెచ్చిరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వారిని అరెస్ట్ చేసిన జైళ్లకు తరలిస్తున్నారు. తమ దేశంలో ప్రవాసులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం…
బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కొందరు చేసే పనులు చూస్తుంటే చేసేవారికి ఎలాగుంటుందో తెలియదు గానీ.. చూసే వారికి మాత్రం ఒళ్లు మండుతుంది. విషయం ఏంటంటే.. కొందరు యువకులు కదులుతున్న రైలు బోగీలు ఎక్కి స్టంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో వారి తీరుపై కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. మరి కొందరు వెరైటీగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక లోకల్ రైలు విలియమ్స్బర్గ్…
భారత భూగంలోకి అక్రమంగా ప్రవేశించి ఇద్దరు చైనీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్‌పోస్ట్ నుంచి నేపాల్‌లోకి ఆదివారం సాయంత్రం అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా జాతీయులు యుంగ్ హై లంగ్ (34), లో లంగ్ (28)ను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్బీ కమాండర్ రాజన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వారి వద్ద ఎలాంటి అధికార పత్రాలు లేకపోవడంతో భారత్‌లోకి అక్రమ ప్రవేశం, ఆర్థిక మోసాలకు సంబంధించి…
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో…
గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ..సోనియా గాంధీకి బీజేపీ నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబంకి అండగా ఉంటామని, సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. నేషనల్…
ప్రధాన మంత్రితో పోల్చితే రాష్ట్రపతి ఎన్నిక పెద్దగా ఉత్కంఠ రేపదు. అలాంటి ఉత్కంఠ భరిత వాతారణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. 1969, 1997 రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే దేశం అలాంటి ఉత్కంఠను చూసింది. చాలా ఏళ్ల తరువాత ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం అని చెప్పవచ్చు. 2017ఎన్నికల మాదిరిగా ఈసారి అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు…
చైనా అణ్వాయుధాలపై ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వీఫెంగే కీలక ప్రకటన చేశారు. కొత్త తరహా అణ్వాయుధాల అభివృద్ధిలో చైనా ఎంతో ప్రగతి సాధించినట్టు వీఫెంగే వెల్లడించారు. అయితే.. అణ్వాయుధాలను చైనా తన స్వీయ రక్షణ కోసమే ఉపయోగిస్తుందని వీఫెంగే వ్యాఖ్యానించారు. అంతేకానీ, ముందుగా చైనా అణ్వస్త్రాలను ప్రయోగించదని స్పష్టం చేశారు వీఫెంగే. చైనా తూర్పు భాగంలో గతేడాది 100కు పైగా అణు క్షిపణీ ప్రయోగ కేంద్రాలను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా.. చైనా రక్షణ…
దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాతపడుతున్నారు. అయితే తాజాగా.. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో రాహుల్ అనే 11 ఏళ్ల బాలుడు పడిపోయాడు. రాహుల్ ను కాపాడేందుకు గుజరాత్ కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. మాట్లాడలేని, వినలేని…