నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. రాజ్‌భవన్ ముట్టడికి టీ కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి ఈ ఆందోళనలల్లో ఓ ఎస్సై కాలర్ పట్టుకున్నారు. ఈ ఘటన వివాదస్పదం తావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీతో…
మరోసారి మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పని అయిపోయిందంటూ ఆయన మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని, కాంగ్రెస్ దివాళా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ నోటిసులు వస్తే ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని, డ్యూటీలో ఉన్న ఎస్సై కాలర్ ఎలా పట్టుకుంటారు? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బంది కలిగిస్తే మా ప్రభుత్వం చూస్తూ…
ఖమ్మం జిల్లా కేంద్రంలో భూముల విలువలు పెరగటంతో దాని కోసం దాడి ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న పుట్ట కోట గ్రామంలో 12 ఎకరాల భూమిపై రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి సంబంధించి కోర్టు పరిధిలో వివాదం కొనసాగుతుండగా దీనికి సంబంధించి హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు భూమిని కొనుగోలు చేశామని భూమి వద్దకు వచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న కొంతమంది వారిమీదికి దాడికి పాల్పడ్డారు. కట్ చేస్తే…. తమ…
రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్య కు పాల్పడినట్లుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు కిషన్ ఉన్నాడని తెలుసుకున్న బంధువులు… స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాకుండా.. అడ్డొచ్చిన పోలీసులను కూడా మృతుడి బంధువులు చితకబాదారు. దీంతో ఒక్కసారి…
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలోని రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ ఒక టీఎంసీ కోసం ఆలోచించిందని, ఇప్పుడు మనం 8.23 టీఎంసీలుగా మార్చామని ఆయన వెల్లడించారు. భూ నిర్వాసితులకు 98 శాతం పరిహారం అందించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి,…
సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా టీ.శ్రీనివాస్‌రావు ఐపీఎస్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన టీ శ్రీనివాస్‌రావు ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆయనను సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే టీ శ్రీనివాస్‌రావు మూడున్నర ఏళ్ల పాటు గవర్నర్ నరసింహన్‌కు ఏడీసీగా పని చేశారు. ఇదిలా ఉంటే… హైదరాబాద్ పరిధిలో భారీగా పోలీసు సిబ్బందిని బదిలీ…
నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. భాగ్యనగరం కాంగ్రెస్ శ్రేణుల నిరసనగాలో అట్టుడికిపోయింది. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టిడికి యత్నించగా.. పోలీసులు వారి పథకాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ సర్కిల్ వద్ద బైక్‌కు నిప్పుపెట్టి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.…
హైదరాబాదు నగర పరిధిలోని పోలీశ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నగరంలోని 2865 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ ఉత్వర్వులు జారీ చేశారు. పోలీసు కానిస్టేబుల్స్-2006, హెడ్ కానిస్టేబుల్-640, ఏఎస్ఐలు -219 మందిని బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వీరి బదిలీలు పెండింగ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. 5 నుండి 7 సంవత్సరములు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్ లైన్…
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గురువారం కొడంగల్‌లో పర్యటించిన హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేక పోయారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని, రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి మీ పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు పై…
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, లబ్దిదారులకు దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో సుమారుగా నాలుగు లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, 12 వందల కోట్లతో పాఠశాలకు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్య శాఖలో త్వరలో 20 వేల…