సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా టీ.శ్రీనివాస్‌రావు ఐపీఎస్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన టీ శ్రీనివాస్‌రావు ప్రస్తుతం సీఐడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆయనను సైబరాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే టీ శ్రీనివాస్‌రావు మూడున్నర ఏళ్ల పాటు గవర్నర్ నరసింహన్‌కు ఏడీసీగా పని చేశారు.
ఇదిలా ఉంటే… హైదరాబాద్ పరిధిలో భారీగా పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు కానిస్టేబుల్స్-2006, హెడ్ కానిస్టేబుల్-640, ఏఎస్ఐలు -219 మందిని బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కోవిడ్ కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వీరి బదిలీలు పెండింగ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. 5 నుండి 7 సంవత్సరములు లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్ లైన్ ద్వారా బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.